ఊహించని విజయం.. డమ్మీ అభ్యర్థి విన్నర్‌

AP Panchayat Elections : Dummy Candidate Won - Sakshi

మామిడికుదురు: ఎన్నికల్లో పలు చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరూ ఊహించని వ్యక్తులకు పదవులు వస్తుంటాయి. 2013 జూలై 31వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఘటనే జరిగింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం కరవాక సర్పంచ్‌ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో సిర్రా మణికుమార్‌ నామినేషన్‌  దాఖలు చేశారు. అతడికి డమ్మీ అభ్యర్థిగా అతడి అన్నయ్య సిర్రా శ్రీనివాస్‌ నామినేషన్‌ వేశారు. పరిశీలన సమయంలో మణికుమార్‌ ఎమ్మార్సీ కార్యాలయంలో క్లస్టర్‌ రీసోర్స్‌ పర్సన్‌ (సీఆర్‌పీ)గా పనిచేస్తున్నందున అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీనిపై అప్పీల్‌కు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన సిర్రా శ్రీనివాస్‌ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top