ఏపీలో కొత్తగా 1,085 కరోనా కేసులు | Ap New Corona Virus Positive Cases Report | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 1,085 కరోనా కేసులు

Aug 22 2021 5:22 PM | Updated on Aug 22 2021 5:52 PM

Ap New Corona Virus Positive Cases Report - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 57,745 మందికి కరోనా పరీక్షలు జరపగా 1,085 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో 8 మంది మృతి చెందారు. తాజాగా 1,541 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,71,045 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 13,723 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,677 మంది యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2,60,91,962 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement