కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ

AP Minister Buggana Rajendranath Meets Union Minister Ravi Shankar Prasad - Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం భేటీ అయ్యారు. మంత్రితో పాటు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఉన్నారు. భేటీ అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో నేషనల్ లా వర్శిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ నెట్ పనులు వేగవంతం చేయాలని అడిగామన్నారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ చేయాల్సిన అవసరం ఉందని.. ఏపీలో ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరామని తెలిపారు. అన్ని అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వెల్లడించారు.

చదవండి: రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్‌
పోర్ట్స్‌ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: గౌతమ్‌రెడ్డి
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top