ఏపీలో జంగిల్‌ రాజ్‌.. పచ్చ మూకల అరాచక కాండ | AP local body elections: Chandrababu Govt Anarchy Updates | Sakshi
Sakshi News home page

ఏపీలో జంగిల్‌ రాజ్‌.. పచ్చ మూకల అరాచక కాండ

Oct 17 2026 7:31 AM | Updated on Oct 17 2026 8:01 AM

AP local body elections: Chandrababu Govt Anarchy Updates

స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని.. ఎలాగైనా సరే గెలుపు టీడీపీదే కావాలని అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. అధికారం అండగా వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులపై ప్రత్యక్షదాడులకు దిగుతున్నారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో నిన్న (శుక్రవారం) నామినేషన్ల తొలి రోజే భయబ్రాంతులకు గురి చేశారు. ‘ప్రజల చేత స్థానిక సంస్థల ఎన్నికల ఎంపికంటూ ఎస్‌ఈసీ గొప్పగా మాటలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పూర్తి విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి.

Updates:

పిడుగురాళ్ల కూడా అదే పరిస్థితి

  • ఇవాళ పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గుర్రం అప్పిరెడ్డి, నంద్యాల బాబు, కందుకూరు శీను, ఈర్ల శివ, మంద ఆనంద్, వేముల కిరణ్,  ఓర్సు
  • దుర్గాప్రసాద్, చల్లా శివారెడ్డిలను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వైఎస్సార్‌సీపీ నాయకులు అల్లు పిచ్చిరెడ్డి, మంద సుధీర్ కణాల శ్రీనివాస్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ మూకల దాష్టీకం

  • వైఎస్సార్‌సీపీ నేతకు చెందిన చికెన్‌ సెంటర్‌కు శుక్రవారం అర్ధరాత్రి నిప్పు పెట్టిన టీడీపీ గూండాలు
  • శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మున్సిపల్ ఇంఛార్జ్‌లు వైఎస్‌ మనోహర్ రెడ్డి, దుష్యంత్‌రెడ్డి

గురజాల: పోలీసుల అక్రమ నిర్బంధంలో వైఎస్సార్‌సీపీ నేతలు

  • ఇవాళ గురజాల నగర పంచాయతీకి నామినేషన్ దాఖలు చేయనున్న చైర్మన్ అభ్యర్థితో పాటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
  • చైర్మన్ అభ్యర్థి పోలు వీరారెడ్డితో పాటు గురజాల్లో కీలక నేతలు యనుమల మురళీధర్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని తీసుకువెళ్లిపోయిన పోలీసులు
  • మీతో మాట్లాడాలి పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పిన గురజాల టౌన్ సీఐ మురళీ
  • పోలీస్ స్టేషన్ బయటి నుంచి ప్రైవేట్ వాహనంలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ నాయకుల్ని ఎక్కించుకుని వెళ్లిపోయిన  సీఐ మురళీ

స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో..

  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు
  • పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం
  • పక్కా పథకం ప్రకారం రాళ్లు, రాడ్లు, కర్రలతో మాటు వేసి మరీ దాడి
  • పోలీసులు ఉన్నారనే ఉనికి కోసం చివరి క్షణంలో గాల్లోకి కాల్పులు
  • రాయచోటిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి.. వాహనాలకు నిప్పు
  • ధర్మవరంలో నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల దాడి
  • నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేసిన కూటమి నాయకులు
  • దాడుల్లో 22 మందికి గాయాలు, వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలు
  • కడపలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు లాక్కొని చించేసిన వైనం
  • తాడిపత్రిలో అభ్యర్థిని హత్య చేస్తామంటూ బెదిరింపులు
  • ఆళ్లగడ్డలో నామినేషన్‌ పత్రాలు చింపి ముఖంపై విసిరేసిన రౌడీలు
  • గుత్తిలో వైఎస్సార్‌సీపీ నేత సోదరుడు జలాని కిడ్నాప్‌ 
  • నామినేషన్‌ వేయకుండా పిడుగురాళ్ల మున్సిపల్‌ కార్యాలయానికి తాళాలు
  • దాచేపల్లిలో అభ్యర్థి నిర్బంధం.. హెచ్చరికలు.. తిరుపతిలో ఎక్కడికక్కడ బరితెగింపు.. దాఖలు చేసిన నామినేషన్లను తీసుకెళ్లిన వైనం
  • టీడీపీ గూండాల దౌర్జన్యాన్ని చిత్రీకరిస్తున్న సాక్షి కెమెరామెన్, రిపోర్టర్‌పై దాడి 
  • రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రాళ్లు, రాడ్లు, కర్రలతో రెచ్చిపోయిన రౌడీ మూకలు
  • ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డగోలుగా బాబు అండ్‌ కో బరితెగింపు
  • కళ్లెదుటే దాడులు జరుగుతున్నా ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement