AP: హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం | Ap Home Minister Convoy Vehicles Collided In Eluru District | Sakshi
Sakshi News home page

AP: హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం

Aug 11 2024 12:08 PM | Updated on Aug 11 2024 12:58 PM

Ap Home Minister Convoy Vehicles Collided In Eluru District

సాక్షి,ఏలూరు జిల్లా: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో మంత్రి ఎస్కార్ట్‌ వాహన డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేశారు. దీంతో ఎస్కార్ట్‌ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఆదివారం(ఆగస్టు11) ఈ ఘటన జరిగింది. 

విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మంత్రి కారు, ఎస్కార్ట్‌ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఘటన తర్వాత మంత్రి అక్కడినుంచి వేరే వాహనంలో వెళ్లిపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement