ఏలూరు టౌన్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులు, డీఎస్పీలకు ఎన్నికల భద్రత, క్షేత్రస్థాయి విధులు, బందోబస్తు ప్రణాళిక, బలగాల మోహరింపు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై తర్ఫీదు ఇచ్చారు. పోలింగ్, ఫలితాల విడుదల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించామని, రూట్ మొబైల్ పార్టీల కదలికలు, పర్యవేక్షణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. బ్యాలెట్ బాక్సుల రవాణాలో జాగ్రత్తలు పాటించాలని, పోలీసు కేంద్రాల వద్ద భద్రత పటిష్టం చేశామని తెలిపారు. జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులు షా అహ్మద్ ఇమ్రాన్ మహ్మద్ ఇర్ఫాన్, చల్లా పవన్‌కల్యాణ్, ప్రొబేషనరీ డీఎస్పీలు హెరుకురి రిజ్వానా, బన్నోత్ ప్రియాంక, మధారపు ప్రత్యూష, చింతగింగాల సాయిరాఘవ, కోల పృధ్వీరాజ్, ముడవత్ రవీంద్రనాయక్, వై.ఎన్. రాకేష్‌రెడ్డి, పి. శ్రీనివాసులు పాల్గొన్నారు.


