నేడే మలి విడత సంగ్రామం | - | Sakshi
Sakshi News home page

నేడే మలి విడత సంగ్రామం

Nov 29 2026 1:34 PM | Updated on Nov 29 2026 1:34 PM

పల్లెలపై రియల్‌ కన్ను

బెంచీలు ధ్వంసం

రండి.. రండి.. రండి దయచేయండి

మూడో విడతలో ఇలా..

న్యూస్‌రీల్‌

పల్లెలపై రియల్‌ కన్ను
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను పల్లెలపై పడింది. నిబంధనలను గాలికి వదిలేసి పచ్చని వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. 8లో u
మలివిడత పల్లెపోరుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 8 మండలాల్లో 194 పంచాయతీలు, 1972 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్‌ నిర్వహించి వెంటనే పోలింగ్‌ ప్రక్రియ పూర్తి చేసి విజేతలను ప్రకటించనున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. బరిలో నిలిచిన అభ్యర్థులు భారీగా ఆఫర్లు, తాయిలాలతో ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు.

● 8 మండలాల్లో 194 పంచాయతీలకు ఎన్నికలు

● 34 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం

● ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం

ఆదివారం శ్రీ 29 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలోని ఏలూరు డివిజన్‌లోని భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, ద్వారకాతిరుమల, కై కలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో ఎన్నికల్లోని 194 గ్రామ పంచాయతీలు, 1972 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో 2024 పోలింగ్‌కేంద్రాల్లో 4,19,290 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఇప్పటికే రెండో విడత పోరులో అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగాయి. మొత్తంగా 34 పంచాయతీలు, 753 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 160 పంచాయతీలు, 1219 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవాల్లో టీడీపీ మద్దతుదారులు 25, జనసేన మద్దతుదారులు 2, బీజేపీ మద్దతుదారులు 6, వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు ఒక స్థానం కై వసం చేసుకున్నారు. కై కలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 110 పంచాయతీలకు గాను 23 పంచాయతీలు ఏకగ్రీవం చేశారు.

ఎన్నికల సామగ్రి పంపిణీ

శనివారం ఉంగుటూరు జెడ్పీ హైస్కూల్‌లో ఎన్నికల మెటిరియల్‌ పంపిణీ ప్రక్రియ నిర్వహించారు. మరోవైపు విధులు కేటాయించిన ఉద్యోగులకు రెండు విడతలుగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అలాగే పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కై కలూరులో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రాంగణంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ కలెక్టర్‌ కే. వెట్రిసెల్వి నేతృత్వంలో నిర్వహించారు.

పశ్చిమలో ఇలా..

పశ్చిమగోదావరి జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తాడేపల్లిగూడెం, భీమవరం డివిజన్లలోని ఆరు మండలాల్లో 121 పంచాయతీలు, వాటి పరిధిలోని 1,286 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో 31 పంచాయతీలు, 571 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇరగవరం మండలంలో 21 పంచాయతీలకు ఇనపర్రు, కావలిపురం, కొత్తపాడు, పొదలాడ, కాకుల ఇల్లిందలపర్రు, కాకిలేరు, యర్రాయిచెరువు పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 14 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

అలాగే గణపవరంలో 25 పంచాయతీలకు జాలికాకినాడ, కొమ్మర, మోయ్యేరు, ముగ్గుల, వెంకట్రాజపురం, కోమర్రు గ్రామలు తణుకు రూరల్‌లో తొమ్మిది పంచాయతీలకు యర్రాయిచెరువు, వేల్పూరు, మహాలక్ష్మి చెరువు, కొమరవరం ఏకగ్రీవమయ్యాయి. తాడేపల్లిగూడెం రూరల్‌లో 27 పంచాయతీలకు మరంపల్లి, మోదుగగుంట, నవాబుపాలెం, కృష్ణయ్యపాలెం, కొమ్ముగూడెం, అత్తిలి మండలంలో 18 పంచాయతీలకు ఆరవల్లి, పాలి, పాలూరు, స్కిన్నెరపురం, ఎల్‌ఎన్‌ పురం గ్రామాలు, పెంటపాడు మండలంలో 21 పంచాయతీలకు అల్లంపురం, దర్శిపర్రు, కాశ్పపెంటపాడు, మీనవల్లూరు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 90 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవుల కోసం 229 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆయా మండలాల పరిధిలో 571 వార్డులు ఏకగ్రీవమవ్వగా 715 వార్డులకు 1,500 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 933 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,50,998 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,23,662 పురుషులు, 1,27,333 మహిళలు ఇతరులు 3, ఉన్నారు.

తొలిదశలో గట్టి షాక్‌

అధికారం, అంగబలం, అర్ధబలం అండతో తొలిదశలో ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు చేసినా తొలి దశలో పల్లె ప్రజలు కూటమికి గట్టి షాకిచ్చారు. కీలకమైన పంచాయతీల్లో పరాభవం అధికార పక్షాలకు మింగుడుపడటం లేదు. తొలి విడతలో 177 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా 68కు పైగా పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థుల్లోను పలువురు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఉన్నారు. అటు ఏకగ్రీవమైన పలు పంచాయతీల్లో సైతం సీలింగ్‌ ఫ్యాన్‌ హవానే ఉండటం కూటమిని కంగారెత్తిస్తోంది. పంచాయతీల్లో పరాభవం తట్టుకోలేక నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన సొంత సామాజికవర్గం వారు ఎమ్మెల్యే తీరును తీవ్రంగా దుయ్యబడుతున్నారు. తొలిదశలో అంచనాలు తల్లకిందులు కావడంతో రెండో దశ ఫలితాలపై కూటమిలో ఆందోళన నెలకొంది. ఏదోవిధంగా పరువు దక్కించుకునేందుకు పాకులాడుతున్నారు. ఓటుకు నోటు, చీరలు, కుక్కర్లు తదితర వస్తుధన రూపంలో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. మూడు వేలు వరకు ముట్టచెబుతున్నట్టు సమాచారం.

పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి ఘనవిజయం సాధించడాన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు బెంచీలను ధ్వంసం చేసి తమ అక్కసు వెళ్లగక్కారు. 8లో u

స్థానిక ఎన్నికల్లో ప్రతీఓటు కీలకం కావడంతో వలస ఓటర్లను స్వగ్రామాలకు తీసుకువచ్చే పనిలో అభ్యర్థులు తలమునకలై ఉన్నారు. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారిని తమకు ఓటు వేసేందుకు స్వగ్రామాలకు రావాలని అభ్యర్థిస్తున్నారు. ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో ఓట్లు కోసం సొంతూళ్లకు వచ్చి వెళ్లిన వారు 20 రోజుల వ్యవధిలో మళ్లీ ఇప్పుడు వచ్చేందుకు వెనుకాడుతున్న పరిస్థితి. వాళ్లు రాకుంటే తమ విజయావకాశాలు దెబ్బతింటాయన్న ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది. రానుపోనూ దారిఖర్చులు తామే భరిస్తామని, తప్పనిసరిగా వచ్చి ఓటేసి వెళ్లమని కోరుతున్నారు.

మూడో విడతలో ఏలూరు రూరల్‌ మండలం, దెందులూరు, పెదపాడు, పెదవేగి, నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు, ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో డిసెంబర్‌ 2న ఎన్నికలు నిర్వహించనున్నారు. 8 మండలాల్లో 173 గ్రామ పంచాయతీలు, 1828 వార్డు స్థానాలకుగాను 35 పంచాయతీలు, 556 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 138 పంచాయతీల్లో, 338 మంది అభ్యర్థులు, అలాగే 1272 వార్డు స్థానాల్లో 2660 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement