‘ఏలూరు’‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్, కానీ‌..

AP High Court Green Signal On Eluru Municipal Elections And Hold The Result - Sakshi

సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని  ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు జరిపి ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 23కి వాయిదా వేసింది. ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై సోమవారం హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ విషయం తెలిసిందే. కాగా, ఆ స్టేను ఎత్తివేస్తూ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

చదవండి: తుది ఓటర్ల జాబితాలో అనేక తప్పులున్నాయన్న హైకోర్టు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top