ఏపీ హైకోర్టులో సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట | AP High Court Grants Relief to CRDA Farmers Protection Committee Members | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట

Jul 1 2026 3:14 PM | Updated on Jul 1 2026 4:30 PM

AP High Court Grants Relief to CRDA Farmers Protection Committee Members

ఏపీ హైకోర్టులో సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట దక్కింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

కాగా, వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై ఇటీవల పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పోలీస్‌ స‍్టేషన్‌లో మరో కేసు నమోదైంది.

అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌తో పాటు డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పానుగంటి చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి నవరత్నాల మూర్తి, తదితరులపై కేసు నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement