ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులను గుర్తించండి

AP govt is ready for vaccination process for Mothers of children under five years - Sakshi

వ్యాక్సిన్‌ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం

సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వీరు ఎంతమంది ఉన్నారో గుర్తించాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ప్రజారోగ్య సంచాలకులు డా.గీతాప్రసాదిని ఆదేశించారు. భవిష్యత్‌లో చిన్నారులకు కరోనా సోకినా తల్లులకు సోకకుండా ఉండేందుకు వీలుగా వారికీ వ్యాక్సిన్‌ వేయాలని ఈనెల 7న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ప్రతి గ్రామంలోనూ తల్లులను గుర్తించేందుకు ఆదేశాలిచ్చారు. ఒకరోజు ముందే టోకెన్‌లు ఇచ్చిన అనంతరం వీరిని వ్యాక్సిన్‌ సెంటర్‌కు తీసుకువచ్చే బాధ్యతను ఆశా కార్యకర్తలకు, ఏఎన్‌ఎంలకు అప్పజెప్పారు. కాగా, వ్యాక్సిన్‌ అవసరమైన తల్లులు 15 లక్షల మందికి పైగానే ఉంటారని అంచనా. వయస్సుతో నిమిత్తం లేకుండా వీరికీ వ్యాక్సిన్‌ వేస్తారు. ఈ విధానం తలపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top