భారమైనా.. ఉల్లి అందుబాటులోకి..

AP Govt buys onions and transports them to Rythu Bazars - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థిక భారం పడుతున్నా ఒకవైపున నాఫెడ్, మరోవైపు ప్రైవేట్‌ మార్కెట్‌లలో ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతుబజార్లకు రవాణా చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఉల్లిపాయలకు డిమాండ్‌ పెరగడంతో నాఫెడ్‌ (నేషనల్‌ అగ్రికల్చర్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌)పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి పెంచాయి. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలైతే ఎన్నికల తేదీలోపు వినియోగదారులకు ఉల్లిపాయలు అందుబాటులోకి తీసుకురాకపోతే ఫలితాలపై ప్రభావం ఉంటుందనే భయంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో మిగిలిన రాష్ట్రాలకు ఉల్లి రవాణా ఆలస్యమవుతోంది. ఇది గమనించిన ఏపీ మార్కెటింగ్‌ శాఖ పది మంది సిబ్బందిని మహారాష్ట్రలోని నాసిక్‌కు పంపింది. వీరిలో కొందరు నాఫెడ్‌కు గతంలో ఇచ్చిన ఇండెంట్‌ ప్రకారం ఉల్లిపాయలను రాష్ట్రానికి రవాణా చేయడానికి, మరికొందరు నాసిక్‌ పరిసర గ్రామాల్లోని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు వెళ్లారు. 

ఉల్లి కొరతను ముందుగానే ఊహించి..
రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఉల్లి కొరతను ముందుగానే ఊహించి సెప్టెంబర్‌లోనే 6 వేల టన్నులను నాఫెడ్‌కు ఇండెంట్‌ పెట్టింది. నాఫెడ్‌ నుంచి కిలో రూ.35లకు ఉల్లి లభిస్తున్నప్పటికీ, అక్కడి నుంచి రాష్ట్రానికి రవాణా, సరుకు గ్రేడింగ్‌ చేయడానికి ప్రభుత్వంపై మరో రూ.15 వరకు అదనపు భారం పడుతోంది. ఇప్పటివరకు ప్రధాన రైతుబజార్లలోనే రాయితీపై ఉల్లిపాయలు అందుబాటులోకి వచ్చాయి. పూర్తిస్థాయిలో ఉల్లిపాయలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగిలిన రైతుబజార్లలోనూ అమ్మకాలు ప్రారంభిస్తామని రైతుబజార్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top