Covid - 19 Update : 618 New Corona Virus Positive Cases Recorded In AP - Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 618  కరోనా కేసులు

Sep 27 2021 4:15 PM | Updated on Sep 28 2021 4:37 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 38,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 618 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 6  మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,142 కు చేరింది. 

గత 24 గంటల్లో 1,178 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 12,482 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,47,459 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,81,32,713 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి: PM Modi: వ్యాక్సిన్‌ ఒక సురక్ష చక్రం

Advertisement
 
Advertisement
Advertisement