రమేష్‌ ఆస్పత్రిపై సుప్రీంకు ఏపీ సర్కార్‌

AP Government Petition On Supreme Court On Ramesh Hospital - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/ అమరావతి : పదిమంది కరోనా బాధితుల మృతికి కారణమైన విజయవాడ రమేష్‌ ఆస్పత్రిపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రమాద కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌ దాఖలు చేసింది. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది కరోనా పేషెంట్లు చనిపోయారని వివరించింది. ఆస్పత్రి నిర్వహణలో అనేక లోపాలున్నాయని ఏపీ ప్రభుత్వం గురువారం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. నిందితుడు రమేష్‌ పరారీలో ఉన్నారని కోర్టుకు తెలిపింది. దర్యాప్తుపై స్టే విధంచడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని  ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. దీనివల్ల దర్యాప్తను ఆటకం కలుగుతోందని ప్రభుత్వం తెలిపింది. (తప్పంతా రమేష్‌ ఆస్పత్రిదే)

రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయనకు, మరో డైరెక్టర్ సీతా రామ్మోహన్ రావులను అరెస్టు చేయకుండా హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం త్వరలోనే విచారణ చేపట్టనుంది. కాగా  విజయవాడ రమేష్‌ ఆస్పత్రికి చెందిన ప్రైవేటు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి గవర్నర్‌పేట పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పోతినేని రమేశ్‌బాబు, చైర్మన్‌ ఎం.సీతారామ్మోహనరావులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు వారిపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ దొనాడి రమేష్‌ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top