కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ఏపీ అప్రమత్తం | AP Government Alerted Over New Virus Strain | Sakshi
Sakshi News home page

కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ఏపీ అప్రమత్తం

Dec 29 2020 6:35 PM | Updated on Dec 29 2020 7:24 PM

AP Government Alerted Over New Virus Strain - Sakshi

సాక్షి, విజయవాడ: కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌పై అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్‌ వచ్చిందని స్పష్టం చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న కుమారుడికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారు 1423 మంది కాగా, వారిలో 1406 మందిని ట్రేస్‌ చేశామని పేర్కొన్నారు. (చదవండి: భారత్‌లో కొత్తరకం కరోనా.. ఆరుగురికి పాజిటివ్‌)

1406 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా, 12 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందన్నారు. 1406 మందితో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన 6,364 మంది గుర్తించామని, వారందరికీ పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు. మొత్తం 24 పాజిటివ్‌ కేసుల శాంపిళ్లను సీసీఎంబీకి పంపించామని తెలిపారు. రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే స్ట్రెయిన్‌ వచ్చిందని నిర్ధారణ అయ్యిందని, మిగిలిన 23 మంది రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు.(చదవండి: ఫ్లైట్‌ దిగారు.. పత్తా లేరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement