భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ కలకలం.. ఆరుగురికి పాజిటివ్‌

Covid 19 Mutant Virus Strain 6 Cases In India Fliers UK Tests Positive - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో యూకే కొత్తరకం స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. కోవిడ్‌-19 పరీక్షలో భాగంగా ఆరుగురికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయ్యింది. కాగా గత నెల రోజులలో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు ఇండియాకు వచ్చారు. వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బెంగళూరులో ముగ్గురు, హైదరాబాద్‌లో ఇద్దరు, పూణేలో ఒకరికి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆరుగురిని ప్రత్యేక గదిలో ఉంచి కేంద్ర వైద్య బృందం పరీక్ష పరీక్షలు నిర్వహిస్తోంది. వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.(చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top