AP Electricity Department Outsourcing Employees Salary Increased - Sakshi
Sakshi News home page

AP: విద్యుత్‌శాఖలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జీతం పెంపు

Aug 16 2023 9:54 AM | Updated on Aug 16 2023 1:04 PM

AP Electricity Department Outsourcing Employees Salary Increased - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల ప్రకారం.. ఏపీలో విద్యుత్‌ శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉ‍ద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, సీఎం జగన్‌ సూచనలతో విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది.  అలాగే, గ్రూప్‌ ఇన్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించింది. 

ఇది కూడా చదవండి: పుంగనూరు అల్లర్లపై నేడు హైకోర్టులో విచారణ.. చంద్రబాబే ఏ1..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement