AP EAMCET Results: ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స

AP EAMCET 2022: AP EAPCET Results Declared By Minister Botsa - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉదయం విడుదల చేశారు. 

ఈఏపీ సెట్‌ ఫలితాల్లో.. వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్‌ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, ఉన్నత విద్య మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి పాల్గొన్నారు.

ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

AP EAMCET (ప్రస్తుతం AP EAPCET అని పిలుస్తారు) APSCHE తరపున JNTU అనంతపురం ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ మరియు అగ్రికల్చర్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశం కల్పిస్తోంది. ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 3,01,172 మంది దరఖాస్తు చేసుకుంటే 2,82,496మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,94,752మంది, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 87,744మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు ఈఏపీ సెట్‌ నిర్వహించారు.

ఫలితాల కోసం AP EAPCET - 2022 Results క్లిక్‌ చేయండి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top