అప్రమత్తంగా ఉన్నాం : డీజీపీ సవాంగ్‌ | AP DGP Gowtham Sawang Comments On Covid Second Wave | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉన్నాం : డీజీపీ సవాంగ్‌

Dec 23 2020 3:01 PM | Updated on Dec 23 2020 3:04 PM

AP DGP Gowtham Sawang Comments On Covid Second Wave - Sakshi

సాక్షి, అమరాతి : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైందని ఆంధ్రప్రదేశ్‌ డీజేపీ గౌతం సవాంగ్‌ అన్నారు. ఏపీలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ..కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తగా వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించామని, కలెక్టర్లు, ఎస్పీలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీసు స్టేషన‍్లలో పాటు లాకప్‌లతో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శీతాకాలం కనుక కోవిడ్‌ జాగ్రత్తలు మరింతగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement