ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

AP CM YS Jagan Letter To Prime Minister Modi - Sakshi

సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. విద్యుత్‌ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ‘కోవిడ్‌ తర్వాత గత ఆరు నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ 15 శాతం పెరిగింది. గత ఒక్కనెలలోనే విద్యుత్‌ డిమాండ్‌ 20 శాతానికిపైగా పెరిగింది. విద్యుత్‌ కొనుగోలు చేయాలంటే కొన్ని సందర్భాల్లో యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తుందని’’ సీఎం లేఖలో పేర్కొన్నారు.

‘‘రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్‌ కొనుగోలు చేయాలన్నా అందుబాటులో ఉండటం లేదు. ఏపీ థర్మల్‌ ప్రాజెక్టులకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాలని కోరుతున్నాం. కొంతకాలంగా పనిచేయని బొగ్గు ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఓఎన్‌జీసీ, రియలన్స్‌ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్‌ సరఫరా చేయాలని కోరుతున్నాం. విద్యుత్‌ డిస్కంలకు బ్యాంకుల ద్వారా సులభతరమైన రుణాలివ్వాలి. కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలను పునరుద్ధరించి మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో కోరారు.

చదవండి:
ఈ నెల 11,12 తేదీల్లో సీఎం జగన్‌ తిరుమల పర్యటన

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top