తుర్లపాటి మృతికి సీఎం జగన్‌ సంతాపం | AP CM YS Jagan Condolences To Turlapati Kutumba Rao Death | Sakshi
Sakshi News home page

తుర్లపాటి కుటుంబరావు మృతికి సీఎం జగన్‌ సంతాపం

Jan 11 2021 10:39 AM | Updated on Jan 11 2021 10:50 AM

సాక్షి, విజయవాడ: సీనియర్ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబరావు కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుర్లపాటి కుటుంబరావు(89) గత రాత్రి కన్నుమూశారు. గుండెపోటుకు గురికావడంతో వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టంగుటూరి ప్రకాశం దగ్గర కార్యదర్శిగా తుర్లపాటి పనిచేశారు. ఆయన మృతి పట్ల ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement