వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్ కడప జిల్లా రైతులు
చంద్రబాబు ప్రభుత్వంపై కేసీ కెనాల్ రైతుల ఆగ్రహం
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్ కడప జిల్లా రైతులు
తమ ప్రాంతానికి నీరిచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతి
వైఎస్సార్, వైఎస్ జగన్ శ్రీశైలంలో 854 అడుగులు ఉన్నప్పుడే నీరిచ్చారని వెల్లడి
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలో తగిన స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కేసీ కెనాల్‌కు సాగు నీరు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలానికి చెందిన కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల బృందం మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించింది.
డాక్టర్ వైఎస్సార్, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాల హయాంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే కేసీ కెనాల్‌కు సకాలంలో సాగు నీరు విడుదల చేసి రైతులను ఆదుకున్నారని రైతులు గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో 878 అడుగులకుపైగా నీరు ఉన్నా కక్ష సాధింపు చర్యలతో చుక్క నీరు వదలడం లేదని ధ్వజమెత్తారు. నీరు విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్‌కి రైతులు విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ
కుట్రపూరిత చర్యలను వివరించారు.
వైఎస్సార్, వైఎస్ జగన్ 854 అడుగులకే నీళ్లిచ్చారు
వైఎస్సార్ హయాంలో, అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి రైతులు పంటలు పండించుకునేలా చేశారు. కానీ నేడు శ్రీశైలంలో 878 అడుగులకు నీళ్లు చేరినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చుక్క నీరివ్వడంలేదు. ఈ అన్యాయంపై మాజీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసి విన్నవించాం. – శేఖర్ రెడ్డి, చిన్నగురువలూరు
చంద్రబాబు పాలనలోనే ఈ కరవు కాటకాలు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే రైతులకు ఇలాంటి కరవు కాటకాలు, కష్టాలు వస్తాయి. చంద్రబాబు ప్రభుత్వ పక్షపాత ధోరణి, కక్ష సాధింపు చర్యల వల్లే ఈ దుస్థితి వచి్చంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొదటి ప్రాధాన్యతగా కేసీ కెనాల్‌కు నీరిచి్చన తర్వాతే విద్యుత్ ఉత్పత్తికి, ఇతర అవసరాలకు ఇవ్వాలి. కానీ మాకు అన్యాయం చేస్తున్నారు.
– శంకర్, చిన్నగురువలూరు


