తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు | AP CM Chandrababu Naidu And Family Visit Tirunala First Time Visit After Oath, Photos Inside | Sakshi
Sakshi News home page

CM Chandrababu Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు

Jun 13 2024 7:26 AM | Updated on Jun 13 2024 10:33 AM

AP CM Chandrababu First Time Visit Tirumala After Oath

తిరుపతి: ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ జేఈవో గౌతమి సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది మంత్రులు, ఎమ్మె‍ల్యేలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. 

ముఖ్యమంత్రి హోదాలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం తొలిసారి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు అసహనానికి గురయ్యారు. అధికారులు పుష్ప గుచ్చాలు ఇస్తున్నప్పటికీ తీసుకోకుండా వాటిని పక్కకు తోసేశారు. అదే సమయంలో స్థానిక నేతలు ఇచ్చిన బొకేలను మాత్రం తీసుకున్నారు.  

సీఎంగా ప్రమాణం చేశాక స్పెషల్‌ విమానంలో కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు.  అయితే.. గాయత్రి నిలయం వద్ద ఆయన వాహనం దిగి నేరుగా లోపలికి వెళ్లారు. అప్పటికే లోపల ఉన్న తితిదే ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు యత్నించగా.. సీఎం చంద్రబాబు తిరస్కరించారు. అయితే.. పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఇచ్చిన గుచ్ఛాలను మాత్రం ఆయన నవ్వుతూ తీసుకున్నారు. 

వాహనం దిగిన తనకు స్వాగతం పలికేందుకు అధికారులు బయటకు రాకపోవడంతోనే ఆయన ప్రవర్తించి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రొటోకాల్‌ అంశం తెరపైకి వచ్చింది. 

ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా విజయవాడ వెళ్తున్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని కుటుంబ సభ్యులతో సహా దర్శించుకోనున్నారాయన. అనంతరం ఈ సాయంత్రం ముఖ్యమంత్రిగా సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వెంటనే కీలక హామీలపైఆయన సంతకాలు చేస్తారని సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement