AP Cabinet Minister Ambati Rambabu: విపక్షంపై ఎదురుదాడి చేయాలంటే అంబటి తర్వాతే ఎవరైనా..

AP Cabinet New Minister Ambati Rambabu Profile - Sakshi

సాక్షి, అమరావతి: సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అంబటి రాంబాబు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పడిన ప్రతీసారి అంతకంటే వేగంగా లేచి నిలబడడం అంబటి నైజం. అనర్గళంగా మాట్లాడడం అంబటికి ఉన్న వరం. ఎంతటి కఠిన విషయమైనా సరే, విడమరిచి చెప్పడం ఆయన ప్రత్యేకత. విపక్షంపై ఎదురుదాడి చేయాలంటే అంబటి తర్వాతే ఎవరైనా. 

వ్యక్తిగతంగా అంబటిని లక్ష్యంగా చేసుకుని ఎన్ని దాడులు వచ్చినా.. కఠినంగా వాటిని తట్టుకుని నిలబడ్డారు అంబటి. తనకు అప్పగించిన ఏ బాధ్యతనయినా నూటికి నూరు శాతం నెరవేర్చడంలో పరిపాటి అంటారు అంబటి గురించి తెలిసిన వాళ్లు. పార్టీ అధికార ప్రతినిధిగా కూడా అంబటి బలమైన గళం వినిపించారు.

గుంటూరు జిల్లా, రేపల్లెలో ఏవీ ఎస్ఆర్ ఆంజనేయులు, వెంకట సుబ్బమ్మ దంపతులకు అంబటి రాంబాబు జన్మించారు. ఆయన విశాఖపట్నంలోని న్యాయ విద్య పరిషత్ లా కాలేజీ నుంచి 1986లో లా డిగ్రీ పూర్తి చేశారు. 

చదవండి: (AP New Cabinet: ఆ అంశాలే కాకాణికి కలిసొచ్చాయి..)

రాజకీయ జీవితం
1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్, 1994లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా చేశారు. 1989లో రేపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లోనే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

2019లో సత్తెనపల్లినుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా.. టీడీపీ అభ్యర్థి, అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పై 20,876 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఎన్నికల సమయానికి సత్తెనపల్లి వీఐపీ నియోజకవర్గం. ఈ సెగ్మెంట్‌లో సతైనపల్లి పట్టణంతో పాటు, సత్తెనపల్లి రూరల్ మండలం, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, మండలాలు సత్తెనపల్లిలో ఉన్నాయి. కోడెలపై విజయం తర్వాత విపక్షం అంబటిని ఎన్ని రకాలుగా సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేసినా.. వాటికి ఎదురొడ్డి అసత్య ప్రచారాన్ని తిప్పగొడుతూ నిలబడ్డారు.

చదవండి: (ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top