ఏపీ అసెంబ్లీ సమావేశాలు: పోలవరంపై స్వల్ప కాలిక చర్చ

Ap Assembly Budget 2023 24 Session March 23 Day 8 Live Updates - Sakshi

Updates:

03:45PM

అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగం

  • మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పనులు పూర్తి చేస్తాం
  • గోదావరిలో భారీ స్థాయిలో వరద వచ్చినా స్పిల్‌ వే ద్వారా వరదను నియంత్రిచగలిగాం
  • పోలవరం పనులన్నీ ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి
  • స్పిల్‌ వే పూర్తి చేసి 48 గేట్లు ఏర్పాటు చేశాం
  • ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు పూర్తి చేశాం
  • ఎల్లో మీడియా తప్పుడు కథనాలు నమ్మొద్దు
  • 45. 7 మీటర్ల ఎత్తు వరకూ డ్యాం నిర్మాణం జరుగుతుంది
  • సీడబ్యూసీ సిఫారసుల మేరకు తొలిదశలోనే 41.15 మీ వరకూ కడతాం
  • పోలవరం ప్రాజెక్ట్‌ కోసమే ప్రధానిని కలిశా
  • తాత్కాలిక పనుల కోసం రూ. 15 వేల కోట్లు అడిగాను
     
  • పోలవరం అంటే వైఎ‍స్సార్‌.. వైఎస్సార్‌ అంటే పోలవరం
  • పోలవరం ప్రారంభించింది మా నాన్నే.. పూర్తి చేసేది ఆయన కుమారుడే
  • 1995 నుంచి 2014 వరకూ చంద్రబాబు నోటివెంట పోలవరం పేరు ఒక్కసారైనా రాలేదు
  • టీడీపీ హయాంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకు వెళ్లలేదు
  • సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు
  • చంద్రబాబు, దత్తపుత్రుడు సహా ఎల్లో మీడియాకు పోలవరం పేరు పలికే అర్హత లేదు
  • పోలవరంపై ఎల్లో మీడియాలో కథనాలు చూశాను
  • గోబెల్స్‌ ప్రచారం చేయడంలో బాబు సిద్ధహస్తుడు
  • పోలవరంపై ఎల్లో మీడియా అసత్య కథనాలు
  • పోలవరం పనులు చంద్రబాబే చేశారంటూ ఎల్లో మీడియా అభూత కల్పనలతో వార్తలు రాసింది
  • పోలవరం అనే పదాన్ని పలికే అర్హత బాబుకు ఉందా?
  • టీడీపీ ద్యాస అంతా డబ్బు స్వాహాపైనే పెట్టింది
  • టీడీపీ హయాంలో పోలవరం నిధులు యధేచ్చగా దోచేశారు
  • పోలవరం కలల ప్రాజెక్టు అని వైఎస్సార్‌ చెప్పారు
  • చంద్రబాబుకు పోలవరం ఏటీఏం అని ప్రధానే అన్నారు
  • టీడీపీ హయాంలో ఎక్కువ డబ్బు వచ్చే పనులు ముందు చేశారు
  • తక్కువ డబ్బు వచ్చే పనులు తర్వాత చేపట్టారు
  • ఇదీ టీడీపీ పోలవరం ఇంజనీరింగ్‌ విధానం
  • టీడీపీ హయాంలో ‍స్పిల్‌ వే పనులను పునాదుల స్థాయిలోనే వదిలేసి కాఫర్‌ డ్యాం పనులు మొదలు పెట్టారు
  • స్పిల్‌ వే పూర్తి కాకుండా కాఫర్‌ డ్యాంలు ఎలా పూర్తి చేస్తారు
  • స్పిల్‌ వే పనులు అసంపూర్ణంగా వదిలేశారు
  • అప్రోచ్‌ చానల్‌ పనులు కూడా జరగలేదు
  • స్పిల్‌ వే పూర్తి కాకండా కాఫర్‌ డ్యాంలు ఎలా పూర్తి చేస్తారు
  • టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్ల డయా ఫ్రం వాల్‌ దెబ్బతింది
  • బుద్ధి ఉన్న వారెవరైనా ఇలా చేస్తారా
  • తమ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేసింది
  • ఇప్పటికే స్పిల్‌ వే.. అప్పర్‌ కాఫర్‌ డ్యాం పూర్తయ్యింది
  • ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉంది

మంత్రి అంబటి రాంబాబు ప్రసంగం

  • ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి చంద్రబాబు
  • జాతీయ ప్రాజెక్టు అయినా మేము కడతా అని చంద్రబాబు అన్నారు
  • 2013-14 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది
  • అందుకు చంద్రబాబు కూడా అంగీకరించారు
  • పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానే అన్నారు
  • విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు
  • పోలవరానికి అయ్యే ప్రతిపైసాను కేంద్రమే భరిస్తుంది అన్నారు
  • కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు
  • తామే కడతామని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలి
  • మా హయాంలోనే పోలవరం పూర్తి అవుతుంది
  • పోలవరం పూర్తి చేసేది మేమే

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు(గురువారం) పోలవరం ప్రాజెక్టుపై స్వల్ప కాలిక చర్చ చేపట్టారు.   దీపిలో భాగంగా పోలవరం ప్రాజెక్టును టీడీపీ నిర్లక్ష్యం చేసిందని రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జయము జయము చంద్రన్న పాటను ధనలక్ష్మీ ప్రస్తావించారు. ఆ పాటకు ఆస్కార్‌ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ధనలక్ష్మీ.

శాసనమండలి:
సామాన్యుడికి అన్ని రకాలుగా సహకరించాలనేదే ప్రభుత్వ పాలసీ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. వెల్ఫేర్‌ వద్దు అని ప్రతిపక్షాలు చెప్పగలవా? గ్రోత్‌లో టాప్‌-5 రాష్ట్రాల్లో ఏపీ ఉంది. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. విద్య, వైద్య రంగంలో కీలక సంస్కరణలు తీసుకువచ్చాం. 13 వేల గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం’’ అని మంత్రి అన్నారు.

మన ప్రభుత్వ విధానాలపై పొరుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు.

విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఆర్మీకేలు ఉన్నాయని ఎమ్మెల్యే జోగారావు అన్నారు. సీఎం జగన్‌ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు.

రైతులకు అండగా నిలుస్తున్నాం: మంత్రి కాకాణి
రైతులకు అండగా నిలిచేలా సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. పంటనష్టం జరిగితే సీజన్‌ ముగిసేలోపే పరిహారం అందజేస్తున్నామన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

సీఎం జగన్‌ ఏపీ అభివృద్ధికి పునాది వేస్తున్నారు: కిలారి రోశయ్య 
సీఎం జగన్‌ రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. రైతులకు గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపంటకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు

ఆ ఘనత సీఎం జగన్‌దే: మంత్రి మేరుగ నాగార్జున
పేద పిల్లలకు ఇంగ్లీష్‌ చదువులు చెప్పిస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్న మనస్సున సీఎం వైఎస్‌ జగన్‌ అని ఆయన అన్నారు.

భావితరాల గుండెల్లో సీఎం జగన్‌ నిలిచిపోతారు: మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. సభలో పలు బిల్లులు, పలు శాఖల డిమాండ్లకు సభ్యులు ఆమోదం తెలపనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top