Andhra Pradesh Rains Another Low Pressure On November 6th - Sakshi
Sakshi News home page

6న మరో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం

Oct 30 2021 8:08 AM | Updated on Oct 30 2021 9:58 AM

Another Low Pressure On November 6th - Sakshi

నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. నవంబర్‌ 6వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. నవంబర్‌ 6వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి తుపానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం మూడు, నాలుగు రోజుల్లో పశ్చిమదిశగా ప్రయాణించి బలహీనపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.

దీనికి అనుబంధంగా ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు  కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో 5.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement