AI Generated Image
విజయవాడ: ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో నిందితుడు అదృశ్యమయ్యాడు. దీంతో హైకోర్టులో అతడి కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఓ కేసులో పోలీసులు ఏసుబాబు అనే వ్యక‍్తిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అతడు కనిపించడం లేదని పిటిషన్‌లో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
గత నెల 17వ తేదీన ఓ కేసు విచారణ కోసం మొగిలిచర్ల ఏసుబాబును జగ్గయ్యపేట పోలీసులు తీసుకెళ్లారు. నాటి నుంచి నేటి వరకూ ఏసుబాబు ఆచూకీ లభ్యం కాలేదు. విచారణ పేరుతో ఏసుబాబు భార్య, అత్తను తీసుకెళ్లి పోలీసులు టార్చర్ చేస్తున్నారు. ఏసుబాబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో హైకోర్టులో మేనమామ పల్లెపోగు శివయ్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. రేపు హైకోర్టులో హెబియస్ పిటిషన్ విచారణకు రానుంది.


