Andhra Pradesh:Notification Released For Election Of Assembly Deputy Speaker - Sakshi
Sakshi News home page

ఏపీ: డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. వైఎస్సార్‌సీపీ నుంచి ఎవరంటే..

Sep 16 2022 9:52 AM | Updated on Sep 16 2022 10:14 AM

 Andhra Pradesh:Notification Released for election of Assembly Deputy Speaker  - Sakshi

( ఫైల్‌ ఫోటో )

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి(శుక్రవారం) నుంచి సాయంత్రం వరకూ నామినేషన్ల స్వీకరణ సాగనుంది. వైఎస్సార్‌సీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్‌ వేసే అవకాశం ఉంది.

కోలగట్ల వీరభద్రస్వా మధ్యాహ్నం 3.30 గంటలకు నామినేషన్‌ వేయనున్నట్లు సమాచారం. సోమవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరుగుతుందని స్పీకర్‌ ఇదివరకే ప్రకటించారు. బలాబలాల రిత్యా డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement