ఏపీ: గత వారంతో పోలిస్తే భారీగా తగ్గిన కేసులు | Andhra Pradesh New Corona Virus Positive Cases Report | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 2,224 కరోనా కేసులు

Jun 28 2021 4:52 PM | Updated on Jun 28 2021 5:33 PM

Andhra Pradesh New Corona Virus Positive Cases Report - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 71,758 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,224 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 31 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,630కు చేరింది. గడిచిన 24 గంటల్లో 4,714 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 24వేల 319 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 42,252 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,18,04,691 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

చదవండి: కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష

Advertisement
 
Advertisement
Advertisement