ఏపీలో కొత్తగా 2,930 కరోనా కేసులు.. | Andhra Pradesh New Corona Virus Positive Cases Recorded | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 2,930 కరోనా కేసులు..

Jul 3 2021 7:04 PM | Updated on Jul 4 2021 6:49 PM

Andhra Pradesh New Corona Virus Positive Cases Recorded - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 90,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,930 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 36 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,815 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 4,346 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 51 వేల 62 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 35,871 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,22,68,483 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement