ఏపీ కరోనా: ఒక్క రోజే 5 వేలకు పైగా రికవరీ | Andhra Pradesh New Corona Virus Positive Cases Recorded | Sakshi
Sakshi News home page

ఏపీ లో కొత్తగా 4,250 కరోనా కేసులు

Jun 27 2021 6:20 PM | Updated on Jun 27 2021 6:42 PM

Andhra Pradesh New Corona Virus Positive Cases Recorded - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 95,327  మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా  4,250  మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 33 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,599 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 5,570  మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 22 వేల 500 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 44,773 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు  2,17,32,933 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి: పిచ్చిరాతలు రాస్తే సహించం..

Advertisement
 
Advertisement
Advertisement