ఏపీలో కొత్తగా 1,435 కరోనా కేసులు.. | Andhra Pradesh Corona Virus Positive New Cases Report | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 1,435 కరోనా కేసులు..

Aug 20 2021 5:41 PM | Updated on Aug 20 2021 5:45 PM

Andhra Pradesh Corona Virus Positive New Cases Report - Sakshi

సాక్షి,అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,435 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో  6గురు మృతి చెందారు. తాజాగా  1,695 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,70,864మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి మొత్తం రాష్ట్రంలో 13,702మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,72,539 మందికి కరోనా పరీక్షలు  నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement