ఏపీలో కొత్తగా 2,925 కరోనా కేసులు | Andhra Pradesh Corona Virus Positive New Cases Report | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 2,925 కరోనా కేసులు

Jul 10 2021 4:52 PM | Updated on Jul 10 2021 5:56 PM

Andhra Pradesh Corona Virus Positive New Cases Report - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,925 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో 26 మంది మృతి చెందారు. తాజాగా 3,937 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,75,035 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 మంది యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి మొత్తం 12,986 మంది ప్రాణాలు వదిలారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,28,94,611 టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement