
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 31వ తేదీన రాష్ణ్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కేబినెట్ సమావేశంలో ప్రస్తావించే ప్రతిపాదనలు ఈనెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా సాధారణ పరిపాలన (కేబినెట్) విభాగానికి పంపాల్సి ఉంటుందని అన్ని శాఖల ఉన్నతాధికారులను సీఎస్ ఆదేశించారు.