రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ | Andhra Pradesh Budget 2025-26 Updates, NDA Govt To Present Annual Budget Today, Check Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

AP Budget 2025 Updates: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌.. పూర్తి అప్‌డేట్స్‌

Feb 28 2025 9:05 AM | Updated on Feb 28 2025 11:22 AM

Andhra Pradesh Budget 2025 26 Updates

హామీలపై చంద్రబాబు మరోమారు ఎలా మోసగించబోతున్నారు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌ అప్‌డేట్స్‌

భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

  • పబ్లిక్ డెట్ 79,227 కోట్లు అంచనా గా చూపించిన ప్రభుత్వం
  • రెవెన్యూ వ్యయం 2,51, 162 కోట్లు
  • పెట్టుబడి వ్యయం 40,636 కోట్లు అంచనాతో బడ్జెట్

‘తల్లికి వందనం’కి నిధులు కోత

  • బడ్జెట్ లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం కి కేటాయింపు
  • 12 వేల కోట్లకు పైగా తల్లికి వందనం కి అవసరం
  • గత ఏడాది ‘తల్లికి వందనం’ పథకానికి నిధులు కేటాయించి ఎగనామం పెట్టిన ప్రభుత్వం

దీపం పథకానికి భారీగా కోత

  • కోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదింపు
  • బడ్జెట్ లో 4 వేల కోట్లకు గాను 2601 కోట్లు మాత్రమే కేటాయింపు

అన్నదాత సుఖీభవకు భారీ కోత

  • అన్నదాత సుఖీభవ కి కేవలం 6300 కోట్లు కేటాయింపు
  • రైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ
  • 10 వేల 400 కోట్లకు 6300 కోట్లే కేటాయింపు

👉 మంత్రి పయ్యావుల బడ్జెట్‌ ప్రసంగం

  • రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌
  • వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు
  • బీసీ క్షేమానికి రూ.23, 260 కోట్లు
  • పాఠశాల విద్యకు 31, 806 కోట్లు
  • ఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లు
  • వైద్య ఆరోగ్య శాఖకు రూ. 19,265 కోట్లు
  • పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 18,848 కోట్లు
  • పురపాలక శాఖకు రూ. 13,862 కోట్లు  కేటాయింపు
  • సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు
  • జలవనరుల శాఖకు రూ.18,020 కోట్లు
  • ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు రూ.3,806  కోట్లు
     
  • రాష్ట్ర పునర్మిర్మాణం సవాలుతో కూడుకుంది
  • 1995నాటి పరిస్థితులే నేడు నెలకొన్నాయి
  • కూటమి అధికారంలోకి వచ్చాక 74 పథకాలను ప్రారంభించాం
  • రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుంది
  • అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలింది

 

  • 2025-26కుగానూ రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ అంచనా
  • మూలధన వ్యయం రూ.40, 635 కోట్లు
  • మూలధన వ్యయం అంచనా రూ.40, 635 కోట్లు
  • రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు
  • ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు
  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు

 

  • శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర

 

👉రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ 2025-26

👉కూటమి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌

👉శాసనసభలో ఏపీ బడ్జెట్‌ 2025  ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్


👉 ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

👉 ఏపీ బడ్జెట్‌ 2025కు కేబినెట్‌ ఆమోదం


👉అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు చాంబర్‌లో మంత్రివర్గం సమావేశం
👉 హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌, మంత్రులు
👉 సూపర్‌ సిక్స్‌ హామీలపై చంద్రబాబు మరోమారు ఎలా మోసగించబోతున్నారనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. 

బడ్జెట్‌.. ఎక్కడ.. ఎవరు?
👉10 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
👉శాసనసభలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
👉 శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 
👉శాసన మండలిలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.

వాట్‌ ఎబౌట్‌ సూపర్‌ సిక్స్‌?
👉ఈ బడ్జెట్ లోనేనా సూపర్ సిక్స్ కి నిధులు కేటాయిస్తారా లేదా అనే సందిగ్ధత..
👉ఇప్పటివరకు సూపర్ సిక్స్ ని అమలు చేయని కూటమి ప్రభుత్వం
👉తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు, మహాలక్ష్మి వంటి పథకాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలు
👉మొదటి ఏడాది సూపర్ సిక్స్ కి మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.


కేటాయింపులైతే చేసేద్దాం!

👉కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది. 
👉ఏడాదిగా హామీల ఊసెత్తని బాబు ఈ బడ్జెట్‌లో పథకాలకు కేటాయింపుల గారడీ చేయనున్నట్లు సమాచారం. 
👉 కేటాయింపులు చేసేద్దాం.. ఎటూ నిధులు ఇచ్చేది లేదుగా అని చంద్రబాబు తలపోస్తున్నట్లు సమాచారం. 
👉2014–19లో కూడా ఆయన చాలా హామీలన్నీ బుట్టదాఖలా చేశారు. రుణమాఫీకి కొన్ని నిధులు కేటాయించినా పూర్తిగా చేసేసినట్లు భ్రమ కల్పించారు.  రకరకాల షరతులు, మాయోపాయాలతో రుణమాఫీ లబ్దిదారులను కుదించేసిన చంద్రబాబు నిరుద్యోగ భృతిని పూర్తిగా మాయం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement