‘ఈ రోజు రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజు’

Amaravati Ysrcp Mla Jogi Ramesh Jagananna Colonies Launch - Sakshi

సాక్షి, అమరావతి: ఈ రోజు రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు. మొదటి విడత 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి  సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని కొనియాడారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 31 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు సొంత ఇంటి కలను సీఎం జగన్ నెరవేర్చబోతున్నారని తెలిపారు. పాదయాత్రలో బడుగుల కష్టాలు చూసి జగన్ విశాల హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. మహిళల పేరు మీదే ఇళ్ల పట్టా, వాళ్ళ పేరు మీదే ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు.

17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలే నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. కలలో కూడా ఊహించని విషయం ఈ రోజు సాకారం కానుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీని వలను 25 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కా చెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. అసలు చంద్రబాబు వెంట ఎవరూ లేరుని రాష్ట్రమంతా మూకుమ్మడిగా జగన్ వెంట అడుగులు వేస్తున్నారని, అందుకు ఇటీవల జరిగిన ఎన్నికలే స్పష్టం చేస్తున్నాయని అన్నారు.

చదవండి: సుస్థిర ఆర్థికాభివృద్ధి: టాప్‌-5 రాష్ట్రాల జాబితాలో ఏపీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top