సిద్ధార్థ కళాశాల సీట్లన్నీ ఏపీవారికే కేటాయించాలి | All the seats of Siddhartha College should be allotted to AP students | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ కళాశాల సీట్లన్నీ ఏపీవారికే కేటాయించాలి

Jun 29 2024 5:44 AM | Updated on Jun 29 2024 5:44 AM

All the seats of Siddhartha College should be allotted to AP students

వైఎస్సార్‌ ఆరోగ్య వర్సిటీ వీసీకి ఏపీ మెడికోస్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ వినతి

సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్‌: విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్‌ సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే కేటా­యించాలని కోరుతూ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వ­విద్యాలయం వీసీ డాక్టర్‌ బాబ్జీకి ఏపీ మెడికోస్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు, కోశాధికారి నరసింహారావు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. 

రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల వరకూ తెలంగాణ విద్యార్థులకు 36 శాతం సీట్లు కేటాయించాలని చట్టంలో ఉందన్నారు. పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ 36 శాతం సీట్లు కూడా మన విద్యార్థులకే కేటాయించాలని కోరారు. అదే విధంగా కొత్త వైద్య కళా శాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల విధానాన్ని రద్దు చేయాలని కోరా రు. తాము అధికారంలోకి వస్తే సెల్ఫ్‌ఫైనాన్స్‌ విధానాన్ని రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల వాగ్ధానం చేసిందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement