తెలుగు ప్రేక్షకులు బెస్ట్‌: నటుడు | Actor Anandraj Visits Simhachalam Temple, Visakhapatnam | Sakshi
Sakshi News home page

‘ముద్దుల మామయ్య’తో గుర్తింపు

Jan 18 2021 10:42 AM | Updated on Jan 18 2021 11:04 AM

Actor Anandraj Visits Simhachalam Temple, Visakhapatnam - Sakshi

సాక్షి, సింహాచలం(పెందుర్తి): ముద్దుల మావయ్య సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చిందని, అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నానని ప్రముఖ సినీ నటుడు ఆనంద్‌రాజ్‌ అన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు బెస్ట్‌ అంటూ ప్రశంసించారు. బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా విశాఖలో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో తొలిసారిగా సింహాచలం వచ్చానన్నారు. అప్పటి నుంచి ఎప్పుడు విశాఖ వచ్చినా.. వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుంటున్నట్టు తెలిపారు. 1986 నుంచి సినిమాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా ఆనంద్‌రాజ్‌ స్వామికి పూజలు నిర్వహించారు. (చదవండి: కిల్‌ రాజు అంటావా..సినిమా ఎవడు ఇస్తాడు?)

Advertisement
 
Advertisement
Advertisement