మాజీ సీఎంకు మరో దెబ్బ.. ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకి చుక్కెదురు

ACB Court Dismiss Chandrababu Skill Scam Bail Petition - Sakshi

సాక్షి, విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో  చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. బెయిల్‌ పిటిషన్‌పై మూడు రోజులపాటు సుదీర్ఘ వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. 

శుక్రవారమే ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేసిన జడ్జి.. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నాం తీర్పు వెల్లడించారు. అంతేకాదు.. చంద్రబాబును మరోసారి కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు అంగళ్లు, ఫైబర్‌ నెట్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌లను ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టేసిన సంగతి విదితమే. 

ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉందని.. బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో బెయిల్‌ ఇవ్వొద్దని ఏపీ సీఐడీ తరపున వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top