
కోవిడ్ బాధితుల్లో తాజాగా 6,659 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,97,699. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 46,624.
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 73,625 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,653 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,50,517 కి చేరింది. కోవిడ్ బాధితుల్లో తాజాగా 6,659 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,97,699. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 46,624. వైరస్ బాధితుల్లో కొత్తగా 35 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6194 కు చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా పరీక్షల్లో 38,619 ట్రూనాట్ పద్ధతిలో, 35,006 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశామని వెల్లడించింది.
(చదవండి: ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. కేసు నమోదు)