కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతపురం, పంపనూరు, పెన్నహోబిలం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లోని ఆలయాలకు మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి శివకేశవుల అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్వాలాతోరణాలతో పాటు నీటిపై దీపాలు వదిలారు. దీపపు కాంతులతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. – అనంతపురం కల్చరల్
అనంతపురం కాశీవిశ్వేశ్వర ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు, అనంతపురం శివకోటి ఆలయంలో కార్తీకదీపాల శోభ, అనంతపురం హెచ్చెల్సీలో నీటిపై దీపాలు వదులుతున్న భక్తులు


