అనంతపురం అర్బన్: ఈవీఎంలు భద్రపరిచిన గోదాముల వద్ద అప్రమత్తంగా ఉండాలని, పటష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘా కొనసాగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్ ఆదేశించారు. నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. అక్కడి లాగ్‌బుక్‌ను పరిశీలించి సంతకం చేశారు. అనంతరం గోదామును సీజ్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాముల వద్ద అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. భద్రత విషయంలో రాజీపడకూడదని చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, ఎన్నికల విభాగం డీటీ కనకరాజ్, ఎస్‌ఏ శామ్యూల్ బెంజిమన్ తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం టౌన్: పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం, కూడేరు మండల కేంద్రాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 200కుపైగా ప్లాట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసక్తిగల యువ పారిశ్రామిక వేత్తలు ఏపీఐఐసీ వైబ్ సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు ఏపీఐఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్కును సంప్రదించాలని సూచించారు.
పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి రేపు కౌన్సెలింగ్
అనంతపురం సిటీ: ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పారా మెడికల్ విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పారా మెడికల్ కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 26న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిబంధనలను అనుసరించి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 117 దరఖాస్తులు అందగా, గురువారం ఉదయం 10.30 గంటల నుంచి డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కళాశాలలను కేటాయించనున్నారు. అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకెళ్లాలి.
స్వచ్ఛమైన ఓటర్ల జాబితా లక్ష్యం
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్ తెలిపారు. సర్‌పై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో డీఆర్‌ఓ మలోలతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివాసం మారిన, చనిపోయిన, డూప్లికేట్ ఓట్లను రీ–వెరిఫికేషన్ చేయనున్నామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా పునఃపరిశీలన ప్రక్రియకు రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు చూరుగ్గా పాల్గొన్నాలన్నారు. డిసెంబరు 15 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరిస్తామన్నారు. డిసెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుందన్నారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు, ప్రతినిధులు భాగస్వాములవ్వాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధి అమరనాథ్‌రెడ్డి, బీజేపీ నేత ఈశ్వరప్రసాద్, టీడీపీ ప్రతినిధి నారాయణస్వామి, కాంగ్రెస్ ప్రతినిధి ఇమామ్, జనసేన ప్రతినిధి కిరణ్‌కుమార్, ఏఏపీ ప్రతినిధి మసూద్‌వలి, తదితరులు పాల్గొన్నారు.


