టన్ను చీనీ రూ.17 వేలు | - | Sakshi
Sakshi News home page

టన్ను చీనీ రూ.17 వేలు

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

న్యూస్‌రీల్‌

అనంతపురం మార్కెట్‌యార్డులో గురువారం టన్ను చీనీకాయలు గరిష్టంగా రూ.17 వేలు, కనిష్టంగా రూ.8 వేల ప్రకారం ధర పలికాయి.

శుక్రవారం శ్రీ 13 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

లైఫ్‌సైన్సెస్‌

స్కిల్‌డెవలప్‌మెంట్‌పై ఒప్పందం

అనంతపురం టౌన్‌: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానం, శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు లైఫ్‌ సైన్సెస్‌ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎస్కేయూ వీసీ ఎన్‌వీఆర్‌ జ్యోతికుమార్‌ తెలిపారు. ఈమేరకు ఆయన గురువారం ఒప్పంద పత్రాలను విడుదల చేశారు. ఉన్నత విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన అనుసంధానం అవసరమన్నారు. ఇలాంటి ఒప్పందాల ద్వారా విద్యార్థులకు ప్రయోగిత నైపుణ్యాలు, పరిశ్రమల్లో ప్రత్యక్ష అనుభవంతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి అవసరమైన నైపుణ్యవంతమైన మానవ వనరులను తయారు చేయడంలో ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, లైఫ్‌సైన్సెస్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పి అమరేంద్రబాబు, విశ్వవిద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

జెడ్పీ పీఠం దక్కేదెవరికి?

● అమాంతం పెరిగిన ఆశావహులు

అనంతపురం న్యూటౌన్‌: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీసీ జనరల్‌కు రిజర్వు అయిన క్రమంలో ఆ వర్గాలకు చెందిన వారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కీలక నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆశావహులు ఎవరెవరు ఉన్నారు? ఎవరికి ఏ నేత మద్దతు ఉంది? అధిష్టానం మదిలో ఎవరున్నారు? మరోమారు ఆ అదృష్టం మహిళలకేనా?...ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ మెదలుతున్నాయి. జిల్లాలోని 31 జెడ్పీటీసీ స్థానాల్లో తొమ్మిది బీసీలకు కేటాయించారు. అన్నింటినీ టీడీపీ అభ్యర్థులు దక్కించుకున్నారు. గార్లదిన్నె జెడ్పీటీసీగా గెలుపొందిన గంజే నాగరాజు జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా దాదాపు ఖరారు అయినట్లు నామినేషన్ల పర్వం ప్రారంభం నుంచే ప్రచారం సాగుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే అదే మండలానికి చెందిన విశాలాక్షితో పాటు ఆవుల కృష్ణయ్య లాంటి టీడీపీ సీనియర్‌ నాయకులు పరిషత్‌ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. కానీ ఇప్పుడు నాగరాజుకు సొంత పార్టీలోనే పోటీ ఎదురవుతోంది. ఉరవకొండ జెడ్పీటీసీ చిత్రగుడి చిరంజీవి, అనంతపురం రూరల్‌ జెడ్పీటీసీ ముంగర మాధవి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. చిరంజీవికి మంత్రి పయ్యావుల కేశవ్‌ మద్దతు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక మాధవి భర్త పామురాయి వెంకటేష్‌ టీడీపీలో సీనియర్‌ నాయకుడు కావడం, ఆయనకు పార్టీ కీలక నేతలతో పరిచయాలు ఉండడంతో భార్యను చైర్‌పర్సన్‌ పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే..వీరెవరికీ కాకుండా బోయ కులస్తులకు అవకాశం ఇవ్వాలని సదరు సామాజిక వర్గానికి చెందిన పార్టీ జిల్లా కీలకనేత, ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య జెడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అనంతపురం ఎడ్యుకేషన్‌: పిల్లలకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు తరగతి గదుల్లో కంటే ఇతర విధుల్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల విధులు, వివిధ శిక్షణ కార్యక్రమాలు, పాఠశాల సముదాయ సమావేశాలు ఇలా వరుస బాధ్యతలతో బోధనకు సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. పని ఒత్తిడి పెరుగుతోందని, బోధనకు దూరమవుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

సిలబస్‌ పూర్తయ్యేదెప్పుడు?

బోధనా సమయం తగ్గిపోవడంతో అనేక పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన వెనుకబడినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లిష్‌, గణితం, సాంఘికశాస్త్రం వంటి కీలక సబ్జెక్టుల్లో మెజార్టీ పాఠశాలల్లో నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఇంకా సిలబస్‌ పూర్తికాలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన సమయంలో పాఠ్యాంశాలే పూర్తికాకపోతే విద్యార్థులు ఎలా పరీక్షలు రాయగలరన్న ప్రశ్న తలెత్తుతోంది. సిలబస్‌ పూర్తి చేయడంతో పాటు పునశ్చరణ, సందేహాల నివృత్తి, నమూనా పరీక్షలకు సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమవుతాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఒక్కో పాఠశాలకు ఏడుగురు టీచర్లు దూరం

ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఏ–1 పరీక్షల్లో భాగంగా పదో తరగతి విద్యార్థులు రాసిన జవాబు పత్రాల్లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఐదు శాతం పత్రాలను పక్క పాఠశాల ఉపాధ్యాయులతో పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. పరీక్ష ముగిసిన మూడు రోజుల తర్వాత ఈ పరిశీలన చేపట్టాల్సి ఉండటంతో ఇందుకోసం ఒకరోజు మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి.

ఐదు శాతం తనిఖీకి ఇంత హడావుడా?

ఒక పాఠశాలలో వంద మంది విద్యార్థులు తెలుగు పరీక్ష రాస్తే, పక్క పాఠశాల నుంచి వచ్చిన తెలుగు ఉపాధ్యాయుడు ఐదు జవాబుపత్రాలను ఎంపిక చేసుకుని పరిశీలిస్తారు. వాటి మూల్యాంకనం సక్రమంగా జరిగిందా? నిర్దేశిత విధానాలు పాటించారా? అనే అంశాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఏడు సబ్జెక్టులకూ ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు తనిఖీలు నిర్వహించనున్నారు. అయితే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలన్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, అందుకోసం ఇప్పటికే బోధనా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను మరో పాఠశాలకు పంపడంతో విద్యార్థుల చదువుకు కలిగే నష్టాన్ని ఎవరు పరిగణనలోకి తీసుకుంటారన్న ప్రశ్న తలెత్తుతోంది.

టీచర్ల ఆత్మగౌరవానికి పరీక్షా?

ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, జవాబుపత్రాలను మూల్యాంకనం చేస్తే.. అదే స్థాయి మరో ఉపాధ్యాయుడిని పంపించి వాటిని తనిఖీ చేయించడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇది తమ పనితీరుపై అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫలితాలు తగ్గితే బాధ్యత ఎవరిది?

ఒకవైపు నాణ్యమైన విద్య అందించాలని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు బోధనకు ఆటంకం కలిగించేలా వరుస బాధ్యతలు అప్పగిస్తోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గితే మాత్రం ఉపాధ్యాయుల బోధన సరిగా లేదని వారిపైనే నిందలు వేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎస్కేయూ రిజిస్ట్రార్‌ ‘అధికార’ దందా!

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిబంధనల ఉల్లంఘనలకు వేదికగా మారింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉన్నత విద్యాసంస్థలో ఒక బోధనేతర అధికారి ఏకంగా యూనివర్సిటీ రెండో అత్యున్నత పీఠమైన ’రిజిస్ట్రార్‌’ పదవిని హస్తగతం చేసుకోవడమే కాకుండా, రూ.43 లక్షల ప్రజాధనాన్ని దోచుకునేందుకు వేసిన ఎత్తుగడ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

అర్హత లేకున్నా అందలం

సాధారణంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ పదవికి సుదీర్ఘ బోధనానుభవం ఉన్న ప్రొఫెసర్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు మాత్రమే అర్హులు. కానీ, మొదట ‘రీసెర్చ్‌ కమ్‌ స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌’గా చేరి, ఆపై ‘ఆఫీసర్‌’గా హోదా మార్చుకున్న డాక్టర్‌ ఈ. రమేష్‌బాబును 2024 జూలై 21న రిజిస్ట్రార్‌ పీఠంపై కూర్చోబెట్టారు. ప్రాధాన్యత లేని ఒక నాన్‌–టీచింగ్‌ కేడర్‌ అధికారికి వర్సిటీ తాళాలు అప్పగించడం వెనుక పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

రూ. 43 లక్షల క్లెయిమ్‌కు ఎత్తు

యూజీసీ 2016 వేతన శ్రేణి జాబితాలో అసలు ’రీసెర్చ్‌ కమ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌’ పోస్టే లేదు. లేని పోస్టును ఉన్నట్లు చూపి, ఏకంగా రూ.43 లక్షలు ఇంక్రిమెంట్‌ అరియర్స్‌ పేరిట క్లెయిమ్‌ చేస్తూ ఫైలు సిద్ధం చేశారు. ఆడిటింగ్‌ విభాగం అభ్యంతరం చెప్పకుండా ఫైలును గట్టెక్కించేందుకు సంబంధిత అధికారులకు పెద్ద ఎత్తున ’ఎర’ వేశారన్న ఆరోపణలున్నాయి. తొలుత వర్సిటీ ఆడిటింగ్‌కు పంపి..పని సులువుగా అవుతుందని భావించారు. అయితే వర్సిటీ ఆడిటింగ్‌లోనూ ఫైల్‌ను వెనక్కి పంపారు. ఇంక్రిమెంట్‌ అరియర్స్‌ ఇవ్వడానికి వీలు లేదంటూ జిల్లా ఆడిటింగ్‌కు సిఫార్సు చేశారు. జిల్లా ఆడిటింగ్‌లోనూ అదే పరిస్థితి ఎదురైంది. ఆఖరుకు స్టేట్‌ ఆడిట్‌కు పంపారు. యూజీసీ పేస్కేలుగానీ, కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (సీఏఎస్‌ ) గానీ వర్తించవని ఈ ఏడాది అక్టోబర్‌ 16న ఏపీ స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ తేల్చిచెప్పింది. స్టేట్‌ ఆడిట్‌ అభ్యంతరం తెలపడంతో రూ.43 లక్షల ఇంక్రిమెంట్‌ అరియర్స్‌ రావడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

రికవరీకి డిమాండ్‌

రీసెర్చ్‌ కమ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టు యూజీసీ పే స్కేల్‌ జాబితాలో ఉందంటూ ఇప్పటికే జీతం అధికంగా డ్రా చేస్తున్నారు. ఇంక్రిమెంట్‌ అరియర్స్‌ ఇవ్వడానికి వీలు లేదని స్టేట్‌ ఆడిట్‌ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో .. ఇప్పటి దాకా వాస్తవ జీతం కన్నా యూజీసీ పే స్కేల్‌ పొందిన జీతం మొత్తం రికవరీ చేయాలనే డిమాండ్లు అధికమయ్యాయి. రీసెర్చ్‌ కమ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ను ఏకంగా రిజిస్ట్రార్‌గా నియామకం చేశారు. రావాల్సిన జీతం కంటే ఎక్కువగా పొందుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని రికవరీ చేయాలని కొందరు హైకోర్టులో పిల్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.

పదో తరగతి.. విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన మలుపు. ఈ సమయంలో ప్రతి పాఠం ఎంతో విలువైనది. కానీ ప్రభుత్వానికి మాత్రం ఈ విషయం పట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రకరకాల బోధనేతర పనులకు వినియోగిస్తుండటంతో బోధన కుంటుపడుతోంది. ఇప్పటికే ఎన్నికల విధులు, శిక్షణలు, సమావేశాలతో సతమతమవుతున్న టీచర్లకు తాజాగా ఎస్‌ఏ–1 పరీక్షల జవాబుపత్రాల పరిశీలన బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది.

పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం

బోధన కంటే బోధనేతర పనులే ఎక్కువ

ఎన్నికల విధులు, శిక్షణలు, సమావేశాలతో టీచర్ల ఉక్కిరి బిక్కిరి

తాజాగా జవాబుపత్రాల తనిఖీ బాధ్యతలతో మరో భారం

పలు స్కూళ్లలో నేటికీ పూర్తికాని పది సిలబస్‌

రూ.43 లక్షల ప్రభుత్వ ధనం దోపిడీకి కుట్ర

యూజీసీ జాబితాలో లేని రీసెర్చ్‌ కమ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టు

అరియర్స్‌ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిన స్టేట్‌ ఆడిట్‌

లక్ష్మీ కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం

చెక్కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

బెంగళూరులో చికిత్స పొందుతున్న గోపిక కుటుంబానికి మరో రూ.5 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement