ముగ్గురిపై ‘మృత్యు’కాటు | - | Sakshi
Sakshi News home page

ముగ్గురిపై ‘మృత్యు’కాటు

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

డి.హీరేహాళ్‌ (బొమ్మనహాళ్‌): సంజీవరాయ కోటలో మృత్యు ‘కాటు’కు ముగ్గురు బల య్యారు.. ఉదయాన్నే పొలానికెళ్లి గేదెలకు మేత తెచ్చేందుకు వెళ్లిన కొడుకును పాము కాటువేసింది.. విషయం తెలిసి తండ్రి.. కుటుంబ సభ్యులతో కలిసి ఆదరాబాదరాగా కారులో ఆస్పత్రికి బయల్దేరారు.. మార్గమధ్యంలో ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది.. తండ్రి, కారు డ్రైవర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు. పాముకాటుకు గురైన కొడుకు చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ప్రాణం విడిచాడు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు, పాముకాటుతో ఒకరు మృతి చెందగా ఎస్‌ఆర్‌కోటలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, డి.హీరేహాళ్‌ ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన మేరకు.. సంజీవరాయకోట (ఎస్‌ఆర్‌ కోట) గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి(55)కి భార్య వరలక్ష్మి, పవన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. పవన్‌రెడ్డికి వివాహం కాలేదు. ఉదయమే పవన్‌రెడ్డి పొలంలో గడ్డి కోస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం డ్రైవర్‌ బోయ చందు (31), పురుషోత్తంరెడ్డి, మల్లికార్జునరెడ్డి భార్య వరలక్ష్మితో కలిసి కారులో బళ్లారి ప్రభుత్వాస్పత్రికి బయల్దేరారు. పులకుర్తి గేట్‌ సమీపానికి చేరుకోగానే, బళ్లారి వైపు నుంచి రాయదుర్గానికి వస్తున్న మరోకారు వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జునరెడ్డి, కారు డ్రైవర్‌ బోయ చందు కారులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. పురుషోత్తంరెడ్డి, వరలక్ష్మి, నరసింగ్‌నాయక్‌, సిద్దేష్‌నాయక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీయించి, పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్‌కు తరలించారు. కాగా, పాముకాటుకు గురైన పవన్‌రెడ్డిని చికిత్స నిమిత్తం బళ్లారి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా జరిగిన ప్రమాదంలో గాయాలు కాలేదు. స్పల్పంగా గాయపడిన తల్లి వరలక్ష్మి, పోలీసులు బళ్లారి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ మృతి చెందా డు. బోయ చందుకు భార్య శ్రీకన్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నా రు. మల్లికార్జునరెడ్డి సోదరుడు హంపారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గంటల వ్యవధిలో కొడుకూ మృతి.. : పొలంలో గడ్డి కోస్తుండగా పాము కాటుకు గురైన పవన్‌రెడ్డి (27) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు ఒకేరోజు మృతి చెందడంతో ఎస్‌ఆర్‌ కోటలో విషాదఛాయ లు అలు ముకున్నాయి. ఒకేరోజు తండ్రీకొడుకులు కాన రాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

మృతులు మల్లికార్జునరెడ్డి, బోయ చందు

ఎదురెదురుగా రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి

పులకుర్తి గేట్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

మరో నలుగురికి స్వల్ప గాయాలు

పాముకాటుకు గురైన పవన్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement