ఫ్యాక్షన్‌కు మారుపేరు పరిటాల | - | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షన్‌కు మారుపేరు పరిటాల

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి

ప్రకాష్‌రెడ్డి,మాజీ ఎంపీ మాధవ్‌

ఆత్మకూరు: ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో పరిటాల కుటుంబం ఫ్యాక్షన్‌ను ప్రేరేపిస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. మాది అభివృద్ధి పాలన.. టీడీపీది అరాచక పాలన అని విమర్శించారు. మంగళవారం ఆత్మకూరులో స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రచారం చేశారు. ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే పరిటాల సునీతకు ఆత్మకూరు గుర్తుకొస్తుందని, సొంత మండలంలోని పేరూరు డ్యాంకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. ఆత్మకూరుకు దశాబ్దాలుగా నీరు లేకుంటే జగనన్నతో మాట్లాడి ఆత్మకూరుకు రూ.50 కోట్లతో పీఏబీఆర్‌ ద్వారా ప్రత్యేక పైప్‌లైన్‌ వేయిస్తే, మిగిలిన 20 శాతం పనులు కూడా చేయించలేకపోతున్నారన్నారు. ఆత్మకూరు పైభాగాన కాలువ పనుల పరిహారం తన హాయాంలో రూ.140 కోట్లు అందజేస్తే, పరిటాల సునీత పైసా కూడా అందజేయలేదన్నారు. హంద్రీ నీవా కాలువకు లైనింగ్‌ వేసి రైతులకు తీరని అన్యాయం చేశారని తెలిపారు.

సునీత ఇలాకాలో పెచ్చుమీరిన దాడులు..

రాప్తాడు నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్యేగా అయి ఉండి కూడా మహిళలపై దాడులు పెచ్చుమీరుతున్నాయని అన్నారు. ఏడు గుర్రాలపల్లిలో బాలికపై 14 మంది అత్యాచారం చేస్తే.. పరిటాల సునీత పరామర్శించిన పాపాన పోలేదన్నారు. గొరిదిండ్లలో అనూష అనే వివాహితపై టీడీపీ నేతలు కత్తులతో దాడి చేశారని గుర్తు చేశారు. మదిగుబ్బ తండాలో గిరిజన మహిళ సరస్వతిపై టీడీపీ నాయకులు దాడి చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మజ్జిగ లింగమయ్య హత్య, రాప్తాడులో దంపతుల హత్య, రూరల్‌లో ఇళ్లను కూల్చి భూ కబ్జాలు.. ఇలా ఎన్నో దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆత్మకూరు–1 భానుకోట బాలపోతన్న, ఆత్మకూరు–2 ఉరుముల అక్క మ్మ, పి.యాలేరులో కృష్ణ, గొరిదిండ్లలో లక్ష్మిదేవి, తలుపూరులో మమత, సనపలో శ్రీనివాసులు, తోపుదుర్తిలో లక్ష్మిదేవి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement