బాలిక కుటుంబానికి అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

బాలిక కుటుంబానికి అండగా ఉంటాం

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని గోపిక కుటుంబాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదివారం పరామర్శించారు. బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రికి వెళ్లి బాలిక తల్లిదండ్రులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గోపిక ఆరోగ్య పరిస్థితి, ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులు, తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. బాలిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే వరకు విద్యాశాఖ తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం, విద్యాశాఖ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆమె వెంట ఆర్జేడీ శామ్యూల్‌, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ అయూబ్‌ హుస్సేన్‌, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ ఉన్నారు.

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌

తమీమ్‌ అన్సారియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement