● పోలింగ్ కారణంగా పూర్తిస్థాయిలో నడవని బస్సులు
● ప్రయాణికులతో తాడిపత్రి రైల్వేస్టేషన్ కిటకిట
తాడిపత్రి రూరల్ : పట్టణంలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కారణంగా అధికారులు ఆర్టీసీ బస్సులను పూర్తిస్థాయిలో నడపలేదు. ఈ కారణంగా కడప, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అనంతపురం నుంచి రావాల్సిన అంతర్ జిల్లాల బస్సులు సైతం సక్రమంగా నడపకపోవడం ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో కడప, తిరుపతి, గుంతకల్లు, కర్నూలు, హైదరాబద్‌లకు వెళ్లే రైళ్ల కోసం వేచివున్న ప్రయాణికులు తాడిపత్రి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. అనంతరం స్టేషన్‌లో ఆగిన రైళ్లల్లోని జనరల్ బోగీల్లో ఎక్కడానికి ప్రయాణికులు ఎగబడ్డారు. అప్పటికే జనరల్ బోగీలు ప్రయాణికులతో నిండివుండడంతో లోపలికి వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.


