పుట్టెంట్రుకల కార్యం ముగించుకుని సొంతూరెళ్తూ.. | - | Sakshi
Sakshi News home page

పుట్టెంట్రుకల కార్యం ముగించుకుని సొంతూరెళ్తూ..

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

నల్లమాడ(ఓడీచెరువు): పుట్టెంట్రుకల కార్యానికి కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి తిరిగి సొంతూరుకు బొలేరో వెళ్తుండగా టైర్‌ బరస్టవ్వడంతో వాహనం అదుపు తప్పింది. ప్రమాదంలో చిన్నయ్య(35) మృతి చెందగా, రామాంజినప్ప, కుషాల్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా నాగలమడక మండలం తిమ్మంపల్లికి చెందిన చిన్నయ్య తన కుమారుడి పుట్టెంట్రుకుల కార్యం నిమిత్తం కదిరి పట్టణంలోని ప్రముఖ క్షేత్రం శ్రీ లక్ష్మీనారసింహుడి ఆలయానికి 20 మంది కుటుంబసభ్యులు, బంధువులతో వచ్చారు. శుభకార్యం ముగించుకుని జీతో బొలేరో(కేఏ06 ఏసీ 2952) సొంతూరుకి వెళ్తుండగా నల్లమాడ మండలంలోని పులగంపల్లి వద్దకు రాగానే బొలేరో టైర్‌ బరస్టయ్యింది. దీంతో వాహనం బోల్తా పడగా, ప్రమాద దాటికి చిన్నయ్య ఆస్పత్రికి వెళ్లే లోపు మృతి చెందాడు. అలానే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మిగిలిన 17 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డ్రైవర్‌ అతివేగం కారణంగా టైర్‌ బరస్ట్‌

అదుపుతప్పి వాహనం బోల్తా; ఒకరు మృతి, 19 మందికి గాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement