న్యూస్‌రీల్
ఉరవకొండ: మండల పరిధిలోని రేణుమాకుపల్లిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి తరఫున శనివారం 145, 146 బూత్ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ వన్నూర్‌స్వామి, ఇంద్రావతి గ్రామ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఓబుళప్ప పాల్గొన్నారు. నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓట్లు వేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కి ప్రచారంలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మినీ వ్యాన్ ఢీకొని
విరిగిపడిన రైల్వే గేటు
రాయదుర్గంటౌన్: పట్టణంలోని అనంతపురం రహదారిపై ఉన్న రైల్వే గేట్‌ను శనివారం మినీ వ్యాన్ ఢీకొనడంతో ఒక్కసారిగా విరిగి కిందపడింది. రాయదుర్గం వైపు నుంచి అనంతపురం వైపువెళ్తున్న వ్యాన్ గేటు వేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, అక్కడి రైల్వే సిబ్బంది, స్థానికులు అప్రమత్తంగా ఉండడంతో అదే సమయంలో రైలు గేటు దాటింది. రైల్వే సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన గేటును మరమ్మతు చేసి రాకపోకలకను పునరుద్ధరించారు.


