పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్‌

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

అనంతపురం అర్బన్‌: మునిసిపల్‌ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్‌ తెలిపారు. పోలింగ్‌ నిర్వహణకు 6 వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. శనివారం స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో చేపట్టిన పోలింగ్‌ సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు జరగనున్న అనంతపురం నగర పాలక సంస్థతో పాటు గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం మునిసిపాలిటీల్లో 1,800 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. పోలీసులకు సహకరించేందుకు, క్యూలైన్ల నిర్వహణకు 1,600 మందిని కేటాయించామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేకంగా సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు పేర్కొన్నారు.

సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా

అనంతపురం, తాడిపత్రి, గుత్తి, తదితర సున్నితమైన ప్రాంతాల్లో 100 శాతం పోలింగ్‌ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వాటిని కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించామన్నారు. మునిసిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రతిచోటా కనీసం 10 నుంచి 15 డ్రోన్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఏ చిన్న ఘటన జరిగినా మూడు నుంచి ఐదు నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతానికి చేరుకుని అదనపు బలగాలు సహాయపడేలా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాష్‌కుమార్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ జశ్వంత్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement