● 1 నుంచి పట్టాలెక్కనున్న వందేభారత్ రైళ్లు
గుంతకల్లు: దేశంలోనే మొట్టమొదటి వందేభారత్ స్లీపర్ కోచ్ (నిద్రించే సౌకర్యం ఉన్న రైలు బోగీ) రైళ్లు గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్ల మీదుగా (డైలీ) రాకపోకలు సాగించనున్నట్లు డివిజన్ కార్యాలయవర్గాలు తెలిపాయి. ఈ రైళ్లను వర్చువల్ పద్ధతిన ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపాయి. బెంగళూరు– ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ (ముంబై)– బెంగళూరు మధ్య నవంబర్ 1 నుంచి పట్టాలెక్కించడానికి రైల్వే బోర్డు అనుమతులు జారీ చేసినట్లు తెలిపాయి. ఈ రైళ్లలో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. అందులో 3 ఏసీ 11, టూటైర్ ఏసీ 4, ఫస్ట్ క్లాస్ 01 ఉంటాయి. ముంబై– బెంగళూరు మధ్య దాదాపు 1118 కి.మీ ప్రయాణానికి 22 గంటలకు పైగా సమయం పట్టేది. దాదాపు 6 గంటలపైగా సమయం ఆదా అవుతుందని ఆశాఖ డివిజన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు
రాకపోకల వివరాలు ..
బెంగళూరు రైల్వే జంక్షన్‌లో (27652) నవంబర్ 1న సాయంత్రం 7.45 గంటలకు బయల్దేరి ధర్మవరం జంక్షన్‌కు రాత్రి 10.10 గంటలకు, అనంతపురం రైల్వేస్టేషన్‌కు 10.28, గుంతకల్లు జంక్షన్‌కు 11.20, రాయచూర్‌కు అర్ధరాత్రి 01.03 గంటలకు, యాదగిరికి 1.43 గంటలకు, వాడి జంక్షన్‌కు 2.50 గంటలకు, కలబురిగి జంక్షన్‌కు 3.08 గంటలకు, షోలాపూర్‌కు తెల్లవారుజూమున 4.20 గంటలకు, పూణే జంక్షన్‌కు ఉదయం 8 గంటలకు, కళ్యాణి జంక్షన్‌కు ఉదయం 10.42 గంటలకు ఇక చివరగా చత్రపతి మహారాజ్ శివాజీ టెర్మినల్ స్టేషన్‌కు మరుసటి రోజు (నవంబర్ 2) ఉదయం 11.55 గంటలకు చేరుతుందన్నారు. ఇక చత్రపతి మహారాజ్ శివాజీ టెర్మినల్ సేష్టన్ (27651) నుంచి మరో వందే భారత్ స్లీపర్ కోచ్ రైలు నవంబర్ 1న రాత్రి 8.10 గంటలకు బయల్దేరనుంది. కళ్యాణి జంక్షన్‌కు 20.48 గంటలకు, పూణే జంక్షన్‌కు 11.40 గంటలకు, కలబురిగి జంక్షన్‌కు తెల్లవారుజూమున 4.13 గంటలకు, వాడి జంక్షన్‌కు ఉదయం 5.05 గంటలకు, యాదగిరి రైల్వేస్టేషన్‌కు 5.08 గంటలకు, రాయచూర్‌కు 6.03 గంటలకు, గుంతకల్లు జంక్షన్‌కు 7.30, అనంతపురానికి 8.38 గంటలకు, ధర్మవరం జంక్షన్‌కు 9.40 గంటలకు, బెంగళూరు జంక్షన్‌కు మధ్యాహ్నం 12.00 గంటలకు చేరుతుందన్నారు.


